స్టాక్ మార్కెట్ వల్ల ప్రయోజనాలు మరియు
ప్రతికూలతలు
సాధారణంగా స్టాక్ మార్కెట్ గురించి మన దేశంలో చాల అపోహలు ఉన్నాయ్.స్టాక్ మార్కెట్ అంటే స్కాం అని , స్టాక్ మార్కెట్ అంటే లాటరి ల భావించి రాత్రి కి రాత్రే డబ్బులు సంపాదించాలి అని వచ్చి డబ్బులు మొత్తం పోగొట్టుకుని స్టాక్ మార్కెట్ గురించి తప్పుగా అనుకుంటారు.కానీ స్టాక్ మార్కెట్ అంటే అది కాదు. ఒకరకంగా చెప్పాలి అంటే ఒకదేశ ఆర్థిక వ్యవస్థను స్టాక్ మార్కెట్ ను ప్రభావితం చేస్తుంది.స్టాక్ మార్కెట్ లో పెట్టుబడి పెట్టేముందు అన్ని తెలుసుకుని పెట్టుబడి పెట్టాలి.
స్టాక్ మార్కెట్ knowledge లేకుండా ఇన్వెస్ట్ చేస్తే తప్పకుండ నష్టాలు వస్తాయి.అందువల్ల షేర్ మార్కెట్ గురించి కొంత నేర్చుకుని ఇన్వెస్ట్ చెయ్యడం మంచిది.స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ లాటరీ కాకుండా ఒక బిజినెస్ ల చూడాలి. మీరు ఒక కంపెనీలో ఇన్వెస్ట్ చేసే ముందు ఆ కంపెనీ యొక్క ప్రొఫైల్ బాగా అనాల్సిసిస్ చేసి అందులో ఇన్వెస్ట్ చేస్తే మీకు లాభాలు వస్తాయి అని నమ్మిన తరువాత రిస్క్ రివార్డ్ చూసుకొని ఇన్వెస్ట్ చెయ్యాలి.మీ డబ్బు మొత్తం ఒకే కంపెనీ లో పెట్టడం కూడా మంచిది కాదు.స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చెయ్యడం వల్ల లాభాలతో పాటు అనేక ఉన్నాయ్.
స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చెయ్యడం వల్ల ప్రయోజనాలు:
1. liquidity
మీరు స్టాక్ మార్కెట్ లో రెండు సంవత్సరాల నుండి ఇన్వెస్ట్ చేస్తుంటే మీ ప్రోటీఫోలియో లో రెండు లక్షలు ఉన్నాయ్ అనుకోండి. మీకు ఇప్పుడు అకస్మాతుగా నీకు డబ్బులు కావాల్సివస్తే వాటిని Sell చేసి రెండు రోజులలో డబ్బు పొంద వచ్చునుకి . లేదా మన షేర్స్ ని చూపించి ఎవరి దగ్గరైన డబ్బులు పొందవచ్చు.
2.High returns
స్టాక్ మార్కెట్ లో లాభాలు fixed deposit, mutual ఫండ్స్ తో పోలిస్తే ఎక్కువగా ఉంటాయి.స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ మెంట్నేఅనేది పూర్తిగా మన KNOWLEDGE మీద ఆధారపడివుంటుంది
3.చీప్ అండ్ బెస్ట్
స్టాక్ మార్కెట్ అనేది అన్నింటి కంటే బెస్ట్ అండ్ చీప్ ఇన్వెస్ట్మెంట్ మీ దగ్గర 1000 లు ఉన్న Demat account open చేసి ఇన్వెస్ట్ మెంట్ మొదలు పెట్టవచ్చును.అదే మనం ల్యాండ్ లో ఇంకా వేరే వాటిలో ఇన్వెస్ట్ చెయ్యాలి అంటే ఎక్కవ amount మనకు కావాలి.
4.FUTURE కోసం
మన ముందు GENERATION చదువుకోలేదు అప్పుడు స్టాక్ మార్కెట్ Process మొత్తం డాక్యుమెంట్ రూపంలో ఉండేది కాబట్టి స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చెయ్యటానికి అంత కష్టంగా ఉండేది కానీ ఇప్పుడు digital రూపంలో Process అంతా సులభతరం అయింది .కావున ఇప్పుడు ఇన్వెస్ట్ చేస్తే మన తర్వాత Generation కు చాల ఉపయోగపడుతుంది.
5. ద్రవ్యోల్భణం(inflation)
ఇప్పుడు పెట్రోల్ 103 అయ్యింది,వంట నూనె, గ్యాస్ అన్ని రెట్టింపు ధర లు పెరిగాయి కానీ మన జీతాలు మాత్రం అలాగే ఉన్నాయ్ ఇలాంటి ద్రవ్యోల్భణం పరిస్థితులలో మన డబ్బు విలువ వాటి తో పాటు పెరగాలి అంటే స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చెయ్యాలి .
6. LOAN AGANEST SECURITY
మన దగ్గర కోటి రూపాయాల ల్యాండ్ ఉంటె మనకు బ్యాంకు లో లోన్ కోసం అప్లై చేస్తే మన ల్యాండ్ విలువలో 40% నుండి 60% వరకు cut చేసి లోన్ డిక్లేర్ చేస్తారు అంటే ఒక 30 లక్షలు అదికూడా మన క్రెడిట్ స్కోర్ ని బట్టి ఉంటుంది. అదే మీరు స్టాక్ మార్కెట్ షేర్స్ మీద లోన్ అప్లై చేస్తే మీ దగ్గర కోటి రూపాయల విలువగల షేర్స్ కి 75 లక్షలు లోన్ వస్తుంది.
ప్రతికూలతలు( disadvantages) :
1.High RISK
స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చెయ్యాలి అనుకుంటే రిస్క్ తీసుకోవటానికి సిద్ధం గా ఉండాలి. ఇందులో లాభాలు ఉంటాయి నష్టాలు ఉంటాయి. రెండింటిని సమానం గా తీసుకునే లా ఉండాలి. నష్టాన్ని ముందుగా గుర్తించే నేర్పు కలిగి ఉండాలి.
2.Commission
మనకు లాభం వచ్చిన నష్టం వచ్చిన brokerage కి కమిషన్ తీసుకుంటుంది.
3.Patience
మనం ఒక ల్యాండ్ తీసుకున్నపుడు లాభం కోసం కొన్ని సంవత్సరాలు పాటు ఎదురుచూస్తాం, fixed డిపాజిట్ , mutual ఫండ్స్ కూడా కొన్ని సంవత్సరాలు ఆగుతాం కానీ స్టాక్ మార్కెట్లో మాత్రం వెంటనే రావాలని కోరుకుంటాం.
4. general issues
స్టాక్ మార్కెట్ ఏదయినా సాధారణ విపత్తు వచ్చిన లేదా పొలిటికల్ ఇష్యూ వచ్చినపుడు ప్రభావితం అవుతాయి.
5.Scams
దేశంలో స్టాక్ మార్కెట్ సంబంధిచి కంపనీ లో ఏదయినా స్కాం జరిగినపుడు స్టాక్ మార్కెట్ లు తీవ్రంగా ప్రభావితం అవుతాయి.
0 కామెంట్‌లు